Breaking News

ఉత్తమ సేవలకు దక్కిన గౌరవం

sudarshan reddy

-డీఎస్పీ సుదర్శన్ గౌడ్ కు ఇండియన్ పోలీస్ మెడల్
కరీంనగర్, ప్రతినిధి : సుదర్శన్ గౌడ్.. ఇప్పడు ఆయన పేరు చెబితే.. అవినీతి పరుల గుండెలు అదిరిపడతాయి.. ప్రభుత్వాధికారులు లంచాలు తీసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ప్రజల్లో ఏసీబీ అంటూ ఒక సంస్థ ఉందని.. అది అవినీతి పరుల భరతం పడుతుందంటూ ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆయన ప్రజలకు చేరువయ్యారు.

ఆయన చేసిన సేవలకు గాను ఏసీపీ డీఎస్పీ తాళ్లపల్లి సుదర్శన్ గౌడ్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్(ఐపీఎం) ప్రకటించింది. అవినీతిపరుల భరతం పడుతూ ఏసీబీని సామాన్యులకు చేరువ చేసిన ఆయన సేవలు గుర్తించిన ప్రభుత్వం ఈ మెడల్ బహూకరించనుంది.

వరంగల్ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తికి చెందిన సుదర్శన్ గౌడ్ 1989లో సివిల్ ఎస్సైగా ఉద్యోగంలో చేరారు. మొదటి పోస్టింగ్ వేములవాడలో పొందిన ఆయన అనంతరం కరీంనగర్ జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో ఎస్సై, సీఐగా విధులు నిర్వర్తించారు.  ఎస్సైగా 1997లో రాష్ట్ర సేవా పతకం పొందారు. ఏసీబీ సీఐగా హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. 2007లో హైదరాబాద్ లో ఉత్తమ సేవా పతకం పొందారు. 2009లో డీఎస్పీగా పదోన్నతి పొంది హుజూరాబాద్ డీఎస్పీగా 20 నెలల పాటు పనిచేశారు. అనంతరం ప్రభుత్వం 2012లో ఆయనను ఏసీబీ డీఎస్పీగా కరీంనగర్ రేంజ్ కు బదిలీ చేసింది. ఆయన గుడ్ సర్వీస్ సర్టిఫికెట్ , 150కిపైగా నగదు అవార్డులు అందుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *