ఉజ్వల పార్కుని సందర్సించిన జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్..

_DSC0023

కరీంనగర్ 17; నగర ప్రజలకు ఆహ్లదాన్ని అందించే విధంగా ఉజ్వల పార్కుని అన్ని హంగులతో ఆధునీకరించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. మంగళవారం ఉదయం ఉజ్వల పార్కుని సందర్సించి ఆధునీకరణ పనుల ప్రగతిని పరిశీలించారు. _DSC0008ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉజ్వల పార్కులో పెయింటింగ్ వేయించాలని ప్రధాన ద్వారం పెద్దదిగా చేయించాలని సూచించారు. ఉజ్వల పార్కులో పిల్లలతో కలిసి కుటుంబం మొత్తం ఒకరోజు ఉత్సాహంగా గడిపేలా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర కమీషనర్ హెచ్. జావీద్, డిప్యూటీ తహశీల్దార్ సి.హెచ్.శ్రీనివాస్, ఆర్.ఐ.కిరణ్ కుమార్, ఉజ్వల పార్క్ నిర్వాహకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *