
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నాడు హైదరాబాద్ కు చెందిన ఓమెగా కాన్పర్ ఆసుపత్రి నిర్వాహకుల సహకారంతో ఉచిత కాన్సర్ నిర్ధారణ శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్.పి. డి.జోయల్ డేవిస్ ప్రారంభించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని దివంగత జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ ధియేటర్ ఆవరణలో ఏర్పాటైన కార్యక్రమంలో ఎస్.పి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆహర అలవాట్ల దృష్ట్యా కాన్సర్ నిర్దారణ పరీక్షలు చేయించుకోవడం అవసరమన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ శిబిరంలో 150 మంది పోలీసు కుటుంబాలకు చెందిన సభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమలంలో అడిషనల్ ఎస్.పి టి.అన్నపూర్ణ, ఎ.ఆర్.డి.ఎస్.పి డి.కోటేశ్వరరావు, ఆర్.ఐలు గంగాధర్, శశిధర్, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ విజయసారధి, ఆర్.ఎస్.ఐ నవీన్, ఆసుపత్రి అసిస్టెంట్
శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.