ఉచిత ఇంటర్నెట్ కోసం గూగుల్ మరో ప్రాజెక్టు

అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ నినాదంతో గూగుల్ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా గూగుల్ పరిశోధనలు తీవ్రతరం చేసి సాధించింది.. గాలి బుడగల సాయంతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీగా ఇంటర్నెట్ ను అందించాలని గూగుల్ పరిశోధన చేసింది. ఇందులో భాగంగా భూమి నుంచి దాదాపు 20 కి.మీల ఎత్తులో భారీ గాలిబుడగలను గూగుల్ వదులుతుంది. సూర్యరశ్మి ఫలకాలను ఏర్పాటు చేసి గాలిబుడగలకు కరెంట్ అందుతుంది. అందులోని 4జీ పరికరాల సహాయంతో గాలిబుడగ ఉన్న ప్రదేశం నుంది దాదాపు 40 కి.మీల మేర 4జీ వైర్ లెస్ ఇంటర్నెట్ అందుతుంది. ఇప్పుడు ఈ ప్రయోగాలను భారత్ లో కూడా చేయాలని గూగుల్ సంసిద్ధత వ్యక్తం చేసి అనుమతి కోరింది.ఇన్నాల్లు దీనిపై పరిశోదన చేసిన భారత ప్రభుత్వం ఎట్టకేలకు ఓకే చెప్పింది.

దీనికోసం భారత్ లో ఒక టెలికాం ఆపరేటర్ తో కలిసి పనిచేయాలని గూగుల్ కు సూచించింది. బీఎస్ ఎన్ ఎల్ ను సిఫారసు చేసింది. కానీ గూగుల్ సంస్థ ప్రేవేటు ఆపరేటర్ల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఈ ప్రయోగానికి లూన్ అనే పేరు పెట్టిన గూగుల్ ఇప్పటికే అమెరికా, న్యూజీలాండ్, బ్రెజిల్ తదితర దేశాల్లో అమలు చేసి విజయవంతంగా 4జీ సేవలను అందించింది.. కాగా దేశంలో కూడా ఈ గాలి బుడగల ఇంటర్నెట్టు సేవలు కనుక ఓకే అయితే మారుమూల పల్లెలకు, పట్నాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుతాయి.. దీనిద్వారా మరింత సాంకేతిక దేశ ప్రజలకు అంది అభివృద్ధి సాధ్యమవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *