ఉచితంగా నే లూ-కేఫేల వినియోగం

కొత్త‌గా 178 లూ-కేఫేల ఏర్పాటుకై టెండ‌ర్ల ఆహ్వానం

న‌గ‌రంలో ప్ర‌జ‌ల అవ‌స‌రాల నిమిత్తం ఏర్పాటు చేయ‌నున్న లూ-కేఫేల‌ను ఉచితంగానే ఉప‌యోగించుకునేలా మార్పులు తెస్తూ తాజాగా టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పొడిగించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. శేరిలింగంప‌ల్లి జోన్ ప‌రిధిలోని శిల్పారామం ఎదురుగా ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించిన లూ-కేఫే విజ‌య‌వంతంగా న‌డ‌వ‌డంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఈ ఆధునిక 178 లూ-కేఫేల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే, ముందుగా నిబంధ‌నలో ఈ లూ-కేఫేలో 20 రూపాయ‌ల ఖ‌రీదుతో కొనుగోలు చేసిన వారికే ఈ టాయిలెట్‌ను వినియోగించుకునే నిబంధ‌న‌ను ఏర్పాటు చేశారు. అయితే, ప‌లు సంస్థ‌లు, న‌గ‌ర‌వాసుల నుండి జీహెచ్ఎంసీకి అందిన విజ్ఞ‌ప్తుల మేర‌కు లూ-కేఫేల‌ను అన్ని వ‌ర్గాల వారు టాయిలెట్ల‌ను ఉచితంగా వినియోగించుకునే విధంగా చూడాల‌ని కోర‌డంతో ఈ లూ-కేఫేల‌లో టాయిలెట్ల‌ను ఉచితంగా ఉప‌యోగించుకునేలా తిరిగి టెండ‌ర్ల ఆహ్వానించాల్సిందిగా రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు మేయర్ బొంతు రామ్మోహ‌న్ లు ఆదేశించానరు. దీనితో న‌గ‌రంలో కొత్త‌గా ఏర్ప‌టు చేయ‌నున్న 178 లూ- కేఫే ల‌ టెండ‌ర్ల గ‌డువును ఆగ‌ష్ఠు 16 వ తేదీ వ‌ర‌కు పెంచుతూ జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డా.బి జ‌నార్థ‌న్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీచెశారు. గ‌తంలో కేవ‌లం మ‌హిళ‌లు, వికలాంగుల‌కు మాత్ర‌మే లూ-కేఫేలను ఉచితంగా ఉప‌యోగించుకునే విధంగా నిబంధ‌న‌లు ఉండేవి. హైద‌రాబాద్‌లో మ‌రిన్ని టాయిలెట్ల‌ను న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులోకి తేవాల‌నే ఉద్దేశంతో ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో 178 లూ-కేఫేల‌ను జీహెచ్ఎంసీకి ఏమాత్రం ఆర్థిక భారం లేకుండా డిజైన్, బిల్ట్‌, ఫైనాన్స్, ఆప‌రేట్, ట్రాన్స్‌ఫ‌ర్ ప‌ద్ద‌తిన టెండ‌ర్ల‌ను ఆహ్వానించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణ‌యించింది. ఈ ఆధునిక లూ-కేఫేలో ఎయిర్ కండీష‌న్‌తో కూడిన టాయిలెట్లు, నాప్కిన్ వెండింగ్ మిష‌న్లు, నాప్కిన్ ఇన్సిన‌రేష‌న్‌, కిడ్స్ డైప‌ర్ చేంజ్ రూం, కేఫే, వైఫై సౌక‌ర్యం, వాట‌ర్ ఏటిఎం, బ్యాంకు ఏటిఎం త‌దిత‌ర సౌక‌ర్యాలు ఉంటాయి.
లూ-కేఫేల ఏర్పాటుకు కావాల్సింది.
*3×3  ఫీట్ల సైజులో ముందుగా నిర్ణ‌యించిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్ర‌క్చ‌ర్‌
* పురుషులు, స్త్రీలు, విక‌లాంగుల‌కు టాయిలెట్ సౌక‌ర్యం
* మొత్తం ఫ్రీ ఫ్యాబ్రికెటెడ్ లూ-కేఫే వ్య‌యం రూ. 12ల‌క్ష‌లు
* అద‌న‌పు స్థ‌లంలో కాఫీ షాపు, ఏటిఎంల ఏర్పాటు
* నిర్వ‌హ‌ణ బాధ్య‌త ఏజెన్సీదే
* కాఫీ షాపు, ఏటీఎం ప్ర‌క‌ట‌న‌ల ద్వారా లూ-కేఫేలు ఆర్థిక నిర్వ‌హ‌ణ వ్య‌యాన్ని స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది.
ఇప్ప‌టికే న‌గ‌రంలోని హోట‌ళ్లు, పెట్రోల్ బంకుల‌లో టాయిలెట్ల‌ను న‌గ‌ర‌వాసులు వినియోగించుకునేలా ఏర్పాటు చేసింది. ఓపెన్ టెండ‌ర్ ద్వారా ఖ‌రారైన ఏజెన్సీలు ఈ లూ-కేఫేల‌ను 15 సంవ‌త్స‌రాల వ‌ర‌కు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని నిబంధ‌న‌లో జీహెచ్ఎంసీ స్ప‌ష్టం చేసింది. అయితే ఈ ఆధునిక లూ-కేఫేల‌ను ప్ర‌పంచ టాయిలెట్ దినోత్స‌వ‌మైన న‌వంబ‌ర్ 19వ తేదీ నాటికి న‌గ‌ర‌వాసుల‌కు అందుబాటులో తేవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *