ఉగ్రవాదం కాదు.. ‘ప్రేమ వాదం’.

విమానం హైజాక్ అయ్యింది… ఈ వార్త వినగానే అధికారుల గుండెలు జల్లు మన్నాయి. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే గుబులు చెందాయి.. కానీ ఆ హైజాక్ చేసింది చంపడానికో.. డబ్బుకోసమో కాదు.. కేవలం ప్రేమ కోసమే.. తన మాజీ ప్రియురాలిని చూడాలని.. తనను కలవాలని ఏకంగా బాంబులు నడుముకట్టుకొని విమానాన్ని అక్కడికి తీసుకెళ్లాలని బెదిరించాడు. దీంతో విమానం పైలెట్లు ప్రియురాలు ఉన్న సైప్రస్ దేశానికి తీసుకెల్లారు. అక్కడ విమానాశ్రయానికి ప్రియురాలిని తీసుకొచ్చి అతడి దరిక చేర్చడంతో ప్రయాణికులను ఆ ప్రేమికుడు వదిలేశారు..

అనంతరం పోలీసులు అతడిని జైలుకు తరలించారు . ప్రేమ కోసం విమానాన్ని హైజాక్ చేసిన ఆ వీర ప్రేమికుడుగాథ ఈజిప్ట్ దేశంలో చోటుచేసుకుంది. ఈ జిప్ట్ నుంచి పక్కదేశం సైప్రస్ లో ఉన్న ప్రియురాలు కోసం విమానాన్ని అక్కడకు తరలించారు. ఇప్పుడు ఈ వీర ప్రేమగాథ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *