
ఈ నెల 29 న జనహిత, ముఖ్యమంత్రి కార్యాలయ సముదాయంలో జరిగే శ్రీ హేవళంబి నామసంవత్సర ఉగాది వేడుకల నిర్వహణకు సంబంధిత శాఖలు తగు ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.
శనివారం సచివాలయంలో లో ఉగాది వేడుకల నిర్వహణపై సమీక్షా సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డా. కె.వి.రమణాచారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ మిశ్రా, నగర పోలీసు కమీషనర్ శ్రీ మహేందర్ రెడ్డి, జి.ఏడి
ముఖ్యకార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, రహదారులు,భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ,కార్యదర్శులు శ్రీ బి.వెంకటేశం,శ్రీ నవీన్ మిత్తల్, జిహెచ్ యంసి కమీషనర్ శ్రీ జనార్ధన్ రెడ్డి,హెచ్ఎండిఏ కమీషనర్ శ్రీ చిరంజీవులు,ఇంటలీజన్స్ ఐజి శ్రీ నవీన్ చంద్, పోలీస్ అధికారులు శ్రీజితెందర్,శ్రీ యం.కె.సింగ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ యం.హరికృష్ణలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉగాది పండుగ సందర్భంగా నాదస్వరం, పూర్ణకుంభస్వాగతం, ప్రార్ధనాగీతం,వేదాశీర్వచనం, పంచాంగ పఠనం,వేదపండితులకు,అర్చకులకు ఆధ్యాత్మిక వేత్తలకు సత్కారం,ఉగాది నృత్యరూపకం లాంటి కార్యక్రమాలుంటాయని సి.యస్ తెలిపారు. భాషాసాంస్కృతికశాఖ, దేవాదయ ధర్మాదాయశాఖ ద్వార నిర్వహించే వేడుకల సందర్భంలోబందోబస్తు,పార్కింగ్ సదుపాయం,మంచినీరు, పారిశుధ్యం, ఆహ్వానపత్రికలు, లైవ్ కవరేజ్,పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్, బ్యారికేడింగ్,నిరంతర విద్యుత్ సరఫరా తదితర ఏర్పాట్లు చేయాలని సి.యస్ ఆదేశించారు. వివిధ శాఖలు తమకు సంబంధించిన పనులు ఈ నెల 28 నాటికి పూర్తిచేయాలన్నారు. సాంస్కృతిక శాఖ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయాలన్నారు.