
ఉగాది రోజే వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు.. పండుగునాడే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ ఎమ్మెల్యేలు పరువుల సుబ్బారావు, సునీల్ కుమార్ లకు విజయవాడలో చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ ఇద్దరి ఎమ్మెల్యేలతో పాటు కింద స్థాయి నాయకులు సర్పంచులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చాలామంది వైసీపీ నుంచి ఎమ్మెల్యేల వెంట టీడీపీ లో చేరారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది..