ఉగాది కానుకగా జెండా పై కపిరాజు  

నాని , అమలా పాల్ , రాగిణి ద్వివేది హీరో హీరోయిన్స్ గా శంబో శివశంబో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖని దర్శకత్వం లో రామ్మోహన్ రావు సమర్పణలో మల్టీ డైమన్షన్ ప్రై లి. పతాకం పై రజత్ పార్థసారధి , ఎస్ శ్రీనివాసన్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జెండా పై కపిరాజు ఇటివలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న త్వరలో విడుదలకు సిద్దం అయ్యింది . ఈ సందర్బంగా  వాసు మాట్లాడుతూ … ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది . ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు కుడా పూర్తయ్యాయి . ఇప్పటికే  ప్రమోషన్ ప్రారంబించాము. ఈ నెల 21న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు . హీరో నాని మాట్లాడుతూ .. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమాకు కష్ట పడిన దానికంటే కుడా ఈ సినిమాకు ఎక్కువగా కష్టపడ్డాను . ఈ సినిమాలో ద్విపత్రాబినయం చేస్తున్నాను . అయితే ఈ సినిమా ప్రివ్యు చూసుకున్న తరువాత చాలా గర్వంగా ఫీలయ్యాను. తప్పకుండా ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుంది . ఇంత మంచి అవకాశం కలిగించిన సముద్రఖని గారికి థాంక్స్  అన్నారు .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *