
‘విజేత’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సంస్థ శ్రీ మోహన్ మూవీ మేకర్స్ పతాకంపై తాజాగా కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన ‘తేజాభాయ్’ చిత్రాన్ని ఉగాది రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పృధ్విరాజ్, అఖిల హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్, తలైవాసన్ విజయ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఎం.రంగారెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి సంయుక్తంగా నిర్మించారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఎం.రంగారెడ్డి, ఎస్.రామచంద్రారెడ్డి చిత్ర విశేషాలను తెలియజేస్తూ… ‘‘ఇందులో పృధ్విరాజ్ నటనకు ప్రాధాన్యం వున్న పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు బోర్ ఫీలవ్వడు. కథ ఎంతో సరదాగా సాగేట్టు దర్శకుడు కరుణాకర్ తెరకెక్కించాడు. మల్లూరి వెంకట్ మాటలు ఈ చిత్రానికి ఓ పెద్ద ఎస్సెట్. చల్లా భాగ్యలక్ష్మి పాటలు ఎంతో వినసంపుగా వున్నాయి. మాఫియా శశి ఫైట్స్ చూడచక్కగా వుంటాయి. ఖర్చుకు ఎక్కుడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని ఎంతో రిచ్‌గా నిర్మించాము. ఈ చిత్రాన్ని ఉగాదికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము’’ అని నిర్మాతలు తెలియజేసారు.