ఉందా…లేదా..? చిత్రం అనౌన్స్ మెంట్

 

జయకమల్ ఆర్ట్స్ బ్యానర్ పై అయితం ఎన్.కమల్ నిర్మాతగా అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉందా…లేదా..?..నూతన నటీనటులు రామకృష్ణ ,అంకిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైద్రాబాద్ మణికొండ సినిమా ఆఫీస్ లో జరిగాయి..ఈ సంధర్భంగా చిత్రయూనిట్ మీడియాతో మాట్లాడింది. దర్శకుడు అమనిగంటి వెంకటశివ ప్రసాద్ మాట్లాడుతూ : విజయవాడ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని…లవ్ ,కామెడీ ,సస్పెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయన్నారు..కథ చెప్పగానే నిర్మాత అయితం.ఎన్.కమల్ గారు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు..ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందని..మే సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నట్లు తెలిపారు..మేజర్ షూటింగ్ అంతా విజయవాడలోనే మూడు షెడ్యూల్స్ లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు..ఇందులో హీరోహీరోయిన్లుగా కొత్తవాళ్లు నటిస్తున్నా కీలకపాత్రల్లో సీనియర్ నటీనటులు నటిస్తున్నారని అన్నారు..ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో జరగబోయే చిత్రం ప్రారంభోత్సవంలో వెల్లడిస్తామని తెలిపారు..నిర్మాత అయితం ఎన్.కమల్ మాట్లాడుతూ : దర్శకుడు అమనిగంటి వెంకట శివ ప్రసాద్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకొచ్చానని అన్నారు..వైజాగ్ లో ఆడిషన్స్ నిర్వహించి 20 మందిని ఎంపిక చేసి ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని తెలిపారు..ఈ చిత్రానికి’ ప్రేమ ఒక మైకం ‘ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె.బంగారి ,కొరియోగ్రాఫర్ గా నందు జెన్నా ,సంగీతం శ్రీ మురళి పలువురు టెక్నిషన్స్ కుదరడం ఆనందంగా ఉందని అన్నారు..సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తానని తెలిపారు. హీరో రామకృష్ణ మాట్లాడుతూ : మా తాతగారు స్టేజ్ ఆర్టిస్ట్ కావడం వల్ల నాకు నటనపై ఆసక్తి పెరిగింది.వైజాగ్ లో జరిగిన ఆడిషన్స్ లో పాల్గోన్న నన్ను సెలెక్ట్ చేయడం..ఓ మంచి కథకు నన్ను మెయిన్ లీడ్ గా ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె.బంగారి ,కొరియోగ్రాఫర్ నందు జెన్నా ,సంగీత దర్శకులు శ్రీమురళీ ,చిత్రయూనిట్ సభ్యులు పాల్గోన్నారు. హీరోహీరోయిన్లు : రామకృష్ణ ,అంకిత , బ్యానర్ :జయకమల్ ఆర్ట్స్ ,కెమెరా :ప్రవీణ్ కె.బంగారి ,కొరియోగ్రాఫర్ :నందు జెన్నా,సంగీతం :శ్రీ మురళి ,నిర్మాత :అయితం ఎన్.కమల్ ,రచన ,దర్శకత్వం :అమనిగంటి వెంకట శివప్రసాద్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *