ఈ సినిమాలు చూసెటట్టు లేవు భాయ్

అది కరీంనగర్ మార్కెట్ ఏరియా.. రాజా టీ పక్కన గల్లీ… ఇద్దరు వృద్ధులు టీ తాగుతున్నారు. ఓ పెద్దాయాన పక్కనే అంటేసి ఉన్న పోస్టర్ చూశారు. ఎవరో కుర్ర హీరో పోస్టర్ ఉంది. మొదటి పెద్దాయన.. రెండో ఆయనతో అన్నారు. ‘‘ఈ హీరోలు మనకు అంతుచిక్కడం లేదయ్యా..మన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల వారసులు కొద్దో గొప్పో తెలుసు… కానీ ఈ కుర్ర హీరోలు ఎవరో అంతుబట్టడం లేదు.  రోజుకో కొత్త హీరో వస్తున్నారు.  అసలు మంచి సినిమాలే రావట్లేదంటూ’’ ఊసురమనుకుంటూ చాయ్ తాగుతున్నారు. ఇప్పట్లో పౌరాణిక సినిమాలు లేవు అన్నది వారి బాధ.. ఏమున్నా లవ్.. యూత్ యేనా మా కోసం ఏదైనా సినిమాలు లేవా అని వారు మధన పడడం కనిపించింది.

నిజమే ఎంతసేపు యువత ఆలోచనల చుట్టే మన సినిమాలు రూపొందుతున్నాయి. కానీ మధ్య వయస్కులు, వృద్దులకు సంబంధించిన సినిమాలు రావడం లేదు.. పౌరాణికాలు తీసినా అవి సినిమా థియేటర్లలో పట్టుమని పదిరోజులు ఉంచడం లేదు. దీంతో సినిమాలు వచ్చినా చూడలేక.. మంచి సినిమాలు లేక మథనపడ్డారు ఆ వృద్ధులు.. ఇది చాయ్ పే చర్చ.. కానీ ఇందులోనూ వృద్ధుల అభిప్రాయం వ్యక్తమైంది. సినిమా మారాలి.. అందరినీ ఆలోచింప చేయాలి.. అందరూ చూడేలా రూపొందాలి. అప్పుడు చిన్నా పేద్దాకు సినిమా తీయని జ్ఞాపకమవుతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *