Breaking News

ఈ భారీ అవశేషం ఏమై ఉంటుందీ..?

avasesam-1024x630

కరీంనగర్, ప్రతినిధి : క్రీస్తుపూర్వం 14-16 శతాబ్ధం నాటి అవశేషంగా భావిస్తున్న ఒక అవశేషం బయటపడింది. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం సరిహద్దులోని మహారాష్ట్ర సిరొంచా తాలూకాలోని వడిదం అటవీ ప్రాంతంలో ఈ భారీ అవశేషం పురావస్తు శాస్ర్తవేత్తలను ఆలోచనలో పడేసింది. ఇది 35 అడుగులతో చాలా పొడువుగా భూమిలో కూరుకుపోయి ఉంది. గట్టి బండరాయిలా వృక్షాన్ని పోలీఉంది. ఇఫ్పుడున్న చెట్లు ఏవీ ఇంత పొడువు లేవు.. 1400 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఇంత పెద్ద చెట్లు ఉండేవా అని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇది చెట్టా.? లేదా ఏదైనా స్థంభమా అనే తేల్చే పనిలో పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు.

ఇటీవల అటవీశాఖాధికారులు వేసవి కాలం సమీపిస్తుండడంతో అటవీప్రాంతంలో జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి గుంటల నిర్మాణం చేపడుతుండగా ఇది బయటపడింది. దీన్ని ఉన్నతాధికారులకు పంపగా నమూనాలను తీసుకొని నాగపూర్ ,పూణె ఫోరెన్సెక్ ల్యాబ్ లకు పంపారు.

కాగా ఇదే ఏరియాలో 1959లో రాక్షసబల్లుల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో ఇది రాక్షసబల్లా, లేదా మరేమైనా జంతువుదా అని పరిశోధకులు అనుమానపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *