
యముడికి మొగుడు, పెదరాయుడు, చంటి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తొలిసారి నిర్మాతగా మారి రూపొందిస్తున్న
చిత్రం‘మలుపు’.ఇందులో ఆయన తనయుడు ఆది పినిశెట్టి హీరోగా నటిస్తుండగా, మరో తనయుడు సత్య ప్రభాస్ పినిశెట్టి దర్శకత్వం చేస్తున్నారు. ఆదర్శ చిత్రాలయ
ప్రై.లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ హిందీ నటుడు మిధున్ చక్రవర్తి కీలకపాత్ర పోషిస్తున్నారు. నిఖిత, నాజర్, రామరాజు, పశుపతి, శ్రావణ్, హరీష్, రిచా,ప్రగతి తదితరులు ఇందులో ముఖ్య తారలు. ఈ నెల 14న హైదరాబాద్ లో సినీ ప్రముఖుల సమక్షంలో పాటల వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రవిరాజా పినిశెట్టిమాట్లాడుతూ అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. స్నేహం నేపధ్యంలో ప్రధానంగా సాగే ఈ సినిమాలో లవ్, యాక్షన్,సెంటిమెంట్, సస్పెన్స్, ఫ్యామిలీ డ్రామా… ఇలా అన్ని అంశాలూ ఉన్నాయి. సత్యప్రభాస్ ది తొలి చిత్రమైనా చాలా బాగా డీల్ చేశాడు. నేను కూడా ఇంత బాగా హ్యండిల్ చేసేవాణ్ణి కాదు. ఒక తండ్రిగా కాకుండా ఒక సీనియర్ దర్శకునిగా చెబుతున్నాను. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 14న పాటలను విడుదల చేస్తున్నాం. ఈ నెల26న చిత్రాన్నివిడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నాం’’అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రసన్, ప్రవీణ్, శ్యామ్, కెమెరా: షణ్ముగ సుందరం, పాటలు: రామజోగయ్య శాస్త్ర్రి, భువనచంద్ర.