ఈ నెల 13న పీపుల్స్ ప్లాజాలో ఫ్రెంచ్ ఏరియల్ షో

ఈ నెల 13న పీపుల్స్ ప్లాజాలో ఫ్రెంచ్ ఏరియల్ షో

ఈ నెల 13న పీపుల్స్ ప్లాజాలో ఫ్రెంచ్ ఏరియల్ షో (Celestial Carillon) నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ ఆజ్మీరా చందూలాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ Indo-French ప్రభుత్వాల ఒప్పందంలో భాగంగా BONJOUR INDIA 2018 ఉత్సవాలను దేశవ్యాప్తంగా 33 నగరాలలో ఈ ప్రదర్శనలను నిర్వహిస్తున్నారని తెలిపారు.మొట్టమొదటి ప్రదర్శనను హైదరాబాద్ నగరాన్ని వేదిక గా ఎంచుకోవడం ఆనందదాయకమన్నారు. ఫ్రెంచ్ ఇన్ స్టిట్యూట్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో 18 మంది కళాకారులతో దేశంలోనే మొదటిసారిగా పెద్ద ఎత్తున సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తున్నారని అన్నారు. పర్యాటక,సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో సంగీతం,నృత్యం, సర్కస్, క్రాఫ్ట్, ఆర్కెష్ట్రా అన్ని కలిసి అద్భుతంగా ఉంటుందన్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వ నిధులతో దాదాపు కోటి రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ ప్రదర్శనకు ఎటువంటి ప్రవేశ రుసుము లేనందున నగర వాసులు పెద్దఎత్తున పాల్లొని జయప్రదం చెయ్యాలని కోరారు. ఇండో-ఫ్రెంచ్ ప్రభుత్వాల మద్య సన్నిహిత సంబంధాలలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ నగరంలో నిర్వహించడాన్ని ప్రభుత్వ సలహాదారు శ్రీ పాపారావు గారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెంచ్ ఇన్ స్టిట్యూట్ ఫ్రాన్సిస్ డైరెక్టర్ ఎమిలిన్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *