ఈ నెల(ఏప్రిల్‌) 24న ‘ఫాదర్‌’ విడుదల

మాస్టర్‌ జితేష్‌ సమర్పణలో నవదీప్‌ ఫిలిం క్రియేటివ్‌ పతాకంపై కమల్‌ కామరాజ్‌, షాయాజీషిండే ప్రధాన పాత్రలుగా జగదీష్‌ వటర్కర్‌ దర్శకత్వంలో, రాజ్‌ పచ్‌ఘరే నిర్మించిన మెసేజ్‌ ఒరియంటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ ‘ఫాదర్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల(ఏప్రిల్‌) 24న విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్‌ పచ్‌ఘరే మాట్లాడుతూ..‘ఇటీవల జరిగిన ఏడవ నాసిక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ చిల్డ్రన్‌ మూవీగా మా ఈ ‘ఫాదర్‌’ నిలిచినందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము. ఈ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలతో కలిసి చూడాల్సిన చిత్రమిది. మంచి మెసేజ్‌తో పాటు ఉన్నత విలువలున్న ఈ చిత్రం ప్రతి ప్రేక్షకుడికి ఎంతగానో నచ్చుతుంది’ అని అన్నారు.
కమల్‌ కామరాజు, షాయాజీషిండే, జ్యోతి, సమీర్‌, ముస్తాఖాన్‌, వృశాలి, మాస్టర్‌ సాయి ప్రణీత్‌, బేబీ కావేరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎవ్‌.వి.ఎస్‌. నాయుడు, సంగీతం: యువరాజ్‌ మోరె, ఎడిటర్‌: మేనుగ శ్రీను, స్క్రీన్‌ప్లే-డైలాగ్స్‌: అనూప్‌ శ్రీవాత్సవ్‌; ఫైట్స్‌: నందు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: టి. గంగాధర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉజ్వల పచ్‌ఘరే
ప్రొడ్యూసర్‌: రాజ్‌ పచ్‌ఘరే

దర్శకత్వం: జగదీష్‌ వటర్కర్‌

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *