ఈ నరమేధం- ఫ్రాన్స్ స్వయం కృతం !

హాయిగా జల్సాలు, విందులు వినోదాలతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫ్రెంచి ప్రజలకు ఊహించని భయంకరమైన అనుభవం. ఉగ్రవాద దాడులకు మూడురోజులు కంటిమీద కునుకు లేదు. మరి, ఈ ఉగ్రదాడులు అనూహ్యంగా జరిగాయా లేక ఫ్రాన్స్ పోలీసుల లోపం ఉందా అంటే, కచ్చితంగా లోపం ఉంది.

తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారు, జైలు శిక్ష అనుభవించిన వారు, అమెరికా నిషేధించిన ఇద్దరు ముస్లిం యువకులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేది పోలీసులు పట్టించుకోలేదు. వారి కదలికలపై నిఘా పెట్టలేదు. దాని ఫలితమే ఇంతటి భయంకరమైన ఉగ్రదాడుల పర్వం. కౌచి బ్రదర్స్ గురించి తెలిసీ నిర్లక్ష్యం చేసిన పోలీసుల పాపం ఫ్రాన్స్ కు శాపమైంది.

కౌచి బ్రదర్స్. పెద్దవాదు సయీద్ కౌచి వయసు 34 ఏళ్లు. కొన్నేళ్ల కిందట యెమెన్ వెళ్లి అల్ ఖైదా నెట్ వర్కులో చేరాడు. ఉగ్రవాద శిక్షణ పొందాడు. మారణాయుధాలు వాడటం, ఇతర అన్ని రకాల టెర్రరిస్టుల ట్రెయినింగ్ పొందాడు. జీహాదీ ఉగ్రవాదులు ఏం చేయాలో తెలుసుకున్నాడు. చిన్న వాడి వయసు 32 ఏళ్లు. ఒక టీవీ డాక్యుమెంటరీలో జీహాదీ ఉగ్రవాదాన్ని సమర్థించి అరెస్టయ్యాడు. 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. వీరిద్దరూ ప్యారిస్ లోని ఓ ఇమాం ప్రభావంతో జీహాదీ ఉగ్రవాదులుగా మారారు. మరి, వీరి కదలికలపై నిఘా పెట్టాలనే చిన్న విషయం కూడా ఫ్రెంచ పోలీసులకు తెలియదా?

పైగా, ప్రపంచ వ్యాప్తంగా ఐసిస్, అల్ ఖైదా, లష్కరే తయిబా ఉగ్రవాదం విస్తరిస్తున్న తరుణంలో అయినా, తమ దేశంలో ఉగ్రవాద ట్రాక్ రికార్డు ఉన్న ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవద్దా? మన దగ్గర ఒక ఎస్ బి కానిస్టేబుల్ కూడా ఇలాంటి విషయాల్లో అలర్ట్ అయి అనుమానితుల మీద ఓ కన్నేసి ఉంచుతాడు. అలాంటిది అంత శక్తివంతమైన, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్ లో పోలీసులు, నిఘా వర్గాలు ఈ విషయాన్ని పట్టించుకోక పోవడం ఆశ్చర్యం. ఆ నిర్లక్ష్యం వల్లే ఇంత అనర్థం జరిగింది. వార పత్రిక కార్యాలయం వద్ద 12 మంది, రెండో రోజు ఓ మహిళా పోలీసు అధికారి, మూడో రోజు గ్రాసరీ షాపులో నలుగురు బందీలు… 17 మంది ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

ఇక ముందైనా ఐరోపా తదితర దేశాలు నేర చరిత గల వారి విషయంలో అప్రమత్తంగా లేకపోతే మరిన్ని దాడులు తప్పవు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.