Breaking News

ఈ చిన్నోడు కీ బోర్డ్ వాయిద్యంలో పెద్దోడు

ఈ చిన్నోడు కీ బోర్డ్ వాయిద్యంలో పెద్దోడు

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లు కొందరు తక్కువ వయస్సులో శక్తికి మించిన అద్భుతాలు చేస్తుంటారు. ఆ కోవకు చెందినవాడే మన కలకుంట్ల అభినవ్. కలకుంట్ల శ్రీవాణి శ్రీనివాసాచార్యులు సంతానమైన అభినవ్ ప్రస్తుతం ఆల్ ఫోర్స్ జెన్ నెక్గ్స్ పాఠశాలలో 7వతరగతి చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాసాచార్యులు కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్ధానంలో ఉద్యోగి, జాతీయస్థాయి జానపద కళాకారులవడంచేత వంశపారంపర్యంగా పుట్టుకతోనే అభినవ్ కు కళ అబ్బింది. తరువాత కె.బి.శర్మ వద్ద కీబోర్డ్ వాయిద్యంలో తర్పీదు పొందుతూనే కీబోర్డ్ వాయిద్యంపై అద్భుత సహకారాన్ని అందిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. గురువుగారు నిర్వహించే అనేక అన్నమయ్య కచేరీలకు కీబోర్డ్ వాయిద్య సహకారం అందిస్తున్నాడు. 2013 బాలల కళోత్సవాలలో కీబోర్డ్ వాయిద్యంలో జిల్లా స్ధాయిలో ప్రధమస్ధానాన్ని పొందినాడు. తల్లి తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలలో అప్పటి జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య గారిచే ప్రశంసలు అందుకున్నారు. ధర్మపురి లో శ్రీ భాగీరధీ నాగభూషణ దీక్షితులు సుహృధ్భవ సంస్ధ వారు నిర్వహించిన అన్నమయ్య కచేరికి కీబోర్డ్ సహకారం అందించి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా పాఠశాలలో జరిగే వార్షికోత్సవంలో కీబోర్డ్ ప్రదర్శనలు ఇచ్చి ఆల్ ఫోర్స్ సంస్ధల అధినేత రెడ్డి గారి అభినందనలు అందుకున్నాడు. కీబోర్డ్ వాయిద్యమే కాకుండా జిల్లా స్ధాయి చదరంగం పోటీలలో పాల్గొని తృతీయ స్ధానాన్ని కైవశం చేసుకున్నాడు. అభినవ్ సంగీత రంగంలో మరింతగా ఎదగాలని ఆశీర్వదిద్దాం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *