ఈ కుంభకోణాల టోర్నీ మాకెందుకు.?

కుంభకోణాలు, స్పాట్ ఫిక్సింగ్ తో గతి తప్పిన ఐపీఎల్ కు స్పాన్సరర్ పెప్సీ కో రాంరాం పలికింది.. ఈ టోర్నీ కి పెట్టుబడి పెట్టడం దండగా అని వైదొలిగింది. ఐపీఎల్ స్పాన్సర్ షిప్ పొందిన పెప్సీ కంపెనీ ఆ స్పాన్సర్ షిప్ రద్దు చేసుకుంది. ఐదేళ్లకు  396 కోట్లకు చేజిక్కించుకొని 2017 వరకు ఉన్న గడువును కూడా కాదనుకొని పెప్సీ వైదొలగడం విశేషం..

కాగా ఇటీవల చైన్నై, తదితర ప్రాంచైజీలు అవినీతి ఆరోపణలతో రద్దు కావడం.. కుంభకోణాలు, స్పాట్ ఫిక్సింగ్ లతో ఐపీఎల్ చెడ్డ ముద్ర వేసుకుంది. దీనికి ఆదరణ కూడా తగ్గిపోయింది. దీంతో ఇక స్పాన్సర్ షిప్ ఉంటే తమకు నష్టాలే అనుకొని పెప్సీ వైదొలిగింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *