Breaking News

ఈ ఓటమి మోడీ-అమిత్ షాలది కాదు..

BJP meeting modi shah jaitley singh pti_1

ఢిల్లీ : బీహార్ ఎన్నికల్లో ఓటమి ప్రధాని మోడీ-అమిత్ షాలది కాదని.. ఒక్కర్నే బాధ్యుల్ని చేయడం తగదని.. పార్టీ గెలుపోటములకు సమష్టి బాధ్యత అని బీజేపీ పార్లమెంటరీ పార్టీ ప్రకటించింది.  గెలిస్తే మోడీ-అమిత్ షాలదేనని ఊదరగొట్టే బీజేపీ ఇప్పుడు ఓడిపోయిన వేళ ఓటమి బాధ్యత పార్టీ నేతలందరిదీ అని తప్పించుకోవడం గమనార్హం.

బీహార్ లో బీజేపీ ఓటమికి మహాకూటమిలో పరస్పర ఓటు బదిలీపై బీజేపీ అంచనాలు తప్పాయని పేర్కొన్నారు. సామాజిక, కుల సమీకరణాలు మహాకూటమికి కలిసివచ్చాయని పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి నిరాశ కలిగించాయని బీజేపీ పార్లమెంటరీ పార్టీ తేల్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *