
హైదరాబాద్, ప్రతినిధి : తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబు కంటే ఒక విషయంలో ముందున్నారు. పాపులర్ పొలిటిషన్ తెలుగు రాష్ట్రల్లో ఎవరు అని ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ సర్వే చేయగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు.
గూగుల్ తెలంగాణ సీఎం కేసీఆరే పాపులర్ అని ప్రకటించింది. 2004 నుంచి 2014 వరకు… అంటే పదేళ్ళ కాలంలో ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ లో కేసీఆర్ నే సెర్చ్ చేశారని గూగుల్ ట్రెండ్స్ ప్రకటించింది.
విశేషం ఏంటంటే…. కేసీఆర్ కంటే టెక్నాలజీ వాడుకోవడంలో చంద్రబాబు చాలా ముందుంటారు. అలాంటిది చంద్రాబాబును వదిలి కేసీఆర్ నే ఎక్కువ మంది గూగుల్ లో వెతికారు. అయితే, మొత్తంగా దేశంలో ఉన్న రాజకీయ నాయకుల పొజీషన్ చూస్తే పీఎం నరేంద్రమోడీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. మోడీతో కంపేర్ చేస్తే కేసీఆర్ చాలా దూరం లో ఉన్నారు.