ఈ ఒక్క ఫొటో బాలుడి జీవితాన్ని మార్చింది..

0012danial

ఫిలిప్పీన్స్ కు చెందిన డానియల్ కు చదువంటే పిచ్చి..కానీ చదువే స్థోమత లేదు.. డానియల్ తల్లి క్రిస్టినా ఓ స్టోర్ లో రోజుకు 2 డాలర్ల (రూ.120) జీతానికి పనిచేస్తోంది. అంతటి దుర్భర స్థితిలో కుటుంబం ఉండడంతో ఇంట్లో విద్యుత్, కరెంటు కూడా లేదు.. అయినా చదువు మీద ఆశతో డానియల్ ఇలా రోడ్డుపక్కన ఉన్న ఓ దుకాణం కిటికీలోంచి వచ్చే వెలుతురు లో ఓ రోజు హోంవర్క్ చేస్తూ కనిపించాడు. ఇది గమనించిన ఓ ఔత్సాహికుడు డానియల్ ను ఫొటో తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు. ఆ ఫొటో ఫేస్ బుక్ లో పాపులర్ అయింది. లక్షల మందికి ఆ ఫోటో షేర్ అయ్యింది..

డానియల్ దీనస్థితిని చూసిన చాలామంది కరిగిపోయి ఆ బాలుడికి వేల రూపాయల సొమ్ము, బట్టలు, ల్యాంపులు, సౌరపరికరాలు ఉదారంగా పంపించి సాయం చేశారు. దీంతో అతడి దశ తిరిగింది. ఇప్పుడు మంచి స్కూలుకు వెళుతున్నాడు. కష్టపడి చదువుతున్నారు. చదువు తోడుంటే పేదరికం అడ్డుకాదని నిరూపితమైంది..

afp-aid-after-filipino-boy-studying-on-street-goes-viral

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *