విరాట్.. వీరోచిత పోరాటం.. భారత్ విజయం

kohli

విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించిన వేళ విజయం భారత్ పాదాక్రాంతం అయ్యింది.. భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచిపోతారు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో విరాట్ ఆడిన తీరు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సగటు అభిమాని దాకా మెచ్చుకోకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.. నరాలు తెగే మ్యాచ్ .. చేధించాల్సిన స్కోరు బంతులు సగానికి పైగా ఉన్నాయి.. అభిమానులందరూ భారత్ ఓటమి ఖాయం అనుకున్న సైలెంట్ గా బాధపడుతున్నారు. టీవీలు చూసే వారు సైతం బంద్ చేశారు.. 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన సమయంలో ఇక విజయం అసాధ్యమని అనుకున్నారంతా..

కానీ కోహ్లీ తన అసాధారణ, అసమాన పోరాట పటిమతో భారత్ ను సెమీస్ చేర్చాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో భారత్ కు విజయాన్నిందించాడు.. భారత్ గెలిచిందటే అది విరాట్ దయ.. ఆటపై ఫ్యాషన్ తో అదే శ్వాస, ఆశగా గల ఇలాంటి క్రికెటర్ ను ఇంతవరకు చూడలేదంటే అతిశయోక్తి కాదు.. గెలుపు కోసం తీవ్ర ఒత్తిడిలో ఇంతటి అద్భుత ఆటతీరు ను కనబర్చిన విరాట్ భారత క్రికెట్ కు దొరికిన మేలు వజ్రం..

నిన్న రాత్రి ఆస్ట్రేలియాతో డూ ఆర్ డై మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్ చేసిన భారత్ కోహ్లీ 51 బంతుల్లో 82 పరుగులు చేసి 19.1 ఓవర్లోనే భారత్ ను ఒంటిచేత్తో గెలిపించాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *