
హైదరాబాద్, ప్రతినిధి : మహేష్ బాబు సాధారణంగా స్లోగా సినిమాలు తీస్తాడనే పేరుంది. ఏడాదికి ఒక సినిమాతోనే సరిపెట్టుకుంటాడు ఈ ప్రిన్స్. అయితే ఈ ఏడాది స్పీడ్ పెంచనున్నాడు మహేష్. ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మహేష్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో రెండు నెలల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవనుంది. దీని తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా తీయనున్నాడు మహేష్. ఈ సినిమా దసరా కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో యాక్ట్ చేయనున్నాడు మహేష్. పూరీ ఎంత త్వరగా సినిమా తీస్తాడో తెలిసిందే. దీంతో 2015లో మూడు సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేయనున్నాడు మహేష్.