ఈ ఏడాది మహిళలపై నేరాలు తగ్గాయి

హైదరాబాద్, ప్రతినిధి : ఈ ఏడాది మహిళలపై నేరాలు తగ్గాయని నగర పోలిస్ కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి చెప్పారు. ఈ ఏడాదిలో నమోదయిన కేసులు, నేరాల వివరాలను ఆయన మీడియాకు వివరించారు. గతేడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో 2014 సంవత్సరంలో నేరాలు కొన్ని విభాగాల్లో పెరగగా మరి కొన్ని విభాగాల్లో తగ్గాయని తెలిపారు. ఈ ఏడాది రెండు వేల 377 మోసాలు జరిగాయన్నారు. 699 ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయని చెప్పారు. చైన్‌ స్నాచింగ్‌ కేసులు గతేడాది 692 కేసులు నమోదుకాగా ఈ ఏడాది 523 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మరింత మంచి పోలీసింగ్‌ చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.