Breaking News

ఈసారి మంచిగా పాలించు : హాజరే

anna-hazare

ఢిల్లీ : ఢిల్లీలో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ కు సామాజిక వేత్త అన్నా హజారే అభినందనలు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో మెజార్టీ సీట్లు సాధించి ప్రతిపక్షాలకు చోటు లేకుండా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హాజరే విలేకరులతో మాట్లాడారు.

కేజ్రీవాల్ మంచి విజయం సాధించారని.. మోడీ మాటలకే పరిమితమై హామీలు అమలు పరచకపోవడంతో ప్రజలు బీజేపీని ఓడించారని తెలిపారు. అవినీతిపై ఎన్నికల ముందు ప్రస్తావించి గెలిచి ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. లోక్ పాల్ సైతం అమలు చేయడం లేదని మండిపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనల్లో ప్రజలతో పాల్గొనడం.. వారి లో విశ్వాసాన్ని పెంచిందని అన్నారు. గతంలో చేసిన తప్పులు చేయకుండా ఈసారి మంచి పాలించాలని కేజ్రీవాల్ కు అన్నాహాజారే సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *