Breaking News

ఈసారి పక్కానట.. ఏప్రిల్ 17న టెట్..

Telangana-TET-notification-To-Release-On-16th-Exam-In-January-2016

తెలంగాణలో టెట్ ప్రకటన జారీ చేసి వరుస ఎన్నికలతో వాయిదా పడుతూ వస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.. కాగా ఈసారి మాత్రం పక్కాగా నిర్వహిస్తామని విద్యాశాఖ చెబుతోంది. ఈ మేరకు ప్రభుత్వానికి అనుమతులు ఇవ్వాలని కోరుతోంది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఓకే చెబితే నోటిఫికేషన్ విడుదల చేయడానికి రెడీ అయ్యింది..
కాగా 20 రోజుల క్రితమే టెట్ షెడ్యూల్ నిర్ణయించి కడియంకు పంపగా.. ఆయన స్వల్ప మార్పులు సూచించినట్లు సమాచారం. దీంతో మళ్లీ అధికారులు తాజా మార్పులు సూచించారు. ఈ నెల 29న ప్రకటన జారీ చేయాలని .. ఏప్రిల్ 17న పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. కడియం ఓకే చెబితే ఈసారి పక్కాగా నోటిపికేషన్ పరీక్ష జరగనుంది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న టెట్ అభ్యర్థుల ఆశలు నెరవేరనున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *