Breaking News

ఈసారి ఉద్యమకారులకు న్యాయం చేశాడు..

kcr11

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థుల ఎంపిక ఓ మిస్టరీ అని ఇన్నాళ్లు ప్రతిపక్షాలు, సొంత టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరిపోసుకునేవారు.. బాగా డబ్బున్నోళ్లకు.. ఇతర పార్టీ నుంచి వచ్చినవాళ్లకే ఇన్నాళ్లు టీఆర్ఎస్ లో అందలం దక్కేది.. వారికే ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇచ్చాడు సీఎం కేసీఆర్.. కానీ మొదటిసారి ఉద్యమకారులకు న్యాయం చేశాడు..

వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ ఉద్యమకారుడికే పట్టం కట్టాడు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి.. 2001 నుంచి పార్టీ కోసం కష్ట పడి పనిచేసి టికెట్ దక్కని వర్ధనపేట మాజీ నియోజకరవర్గ ఇన్ చార్జి కు ఆయన ఊహించని విధంగా వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది.. వరంగల్ టికెట్ కూడా డబ్బున్నోల్లకు, ఇతర పార్టీ నేతలకే ఇస్తారని ఊహించారంతా.. కానీ ఈసారి మాత్రం న్యాయం జరిగింది..

అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ బాస్.. ఆయనను ఎదురించి ఎవరూ మాట్లాడలేరు. ఆయన నిర్ణయమే ఫైనల్.. అందుకే కేసీఆర్ ఇతర పార్టీల నేతలను నిలబెట్టిన కుయ్యిమనకుండా టీఆర్ఎస్ నాయకులు పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఉద్యమకారుడైన దయాకర్ కే టికెట్ దక్కడంతో వరంగల్ నేతల్లో ఉత్సాహం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి బలహీన అభ్యర్థులు పోటీ పడుతుండడంతో దయాకర్ గెలుపు నల్లేరు నడకే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *