
-తెలంగాణకు కేంద్రం 222 మె.వా విద్యుత్ కేటాయింపు -ఫలించిన సీఎం కృషి
తెలంగాణలో ఈ వేసవి సీజన్ కరెంటు కోతలు లేనట్టే.. సీఎం కేసీఆర్ వరస ప్రయత్నాలు ఫలించాయి. కేంద్రం తన దగ్గర ఉన్న విద్యుత్ ను కేటాయించాలని ఎన్నోసార్లు కేంద్రంతో సంప్రదింపులు జరిపిన సీఎం కేసీఆర్ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. జజ్జర్ లోని అరవాళి పవర్ కంపెనీ నుంచి 222 మె.వా విద్యుత్ ను కేంద్రం తెలంగాణ కు కేటాయించింది. దీంతో చిన్న చితక కంపెనీలు, కేరళ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మర్ లో విద్యుత్ కొనుగోలు చేస్తుండడంతో ఈ సమ్మర్ లో ప్రజలకు విద్యుత్ కోతల నుంచి గట్టెక్కినట్టైంది. మొత్తానికి సీఎం కేసీఆర్ గత సీజన్ లో అభాసుపాలైన విద్యుత్ సంక్షోభాన్ని ఈ సీజన్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల కష్టాలను గట్టెక్కించారు. అదే ఏపీలో ఇంకా పల్లెల్లో విద్యుత్ కోతలు కొనసాగుతుండడం గమనార్హం.