‘ఈశాన్య’ ముంచింది ఏపీ, తమిళనాడును..

VBK-PULIANTHOPE_167988g

ఈశాన్య రుతుపవనాలు ఏపీ, తమిళనాడును ముంచేశాయి.. కరువు కోరల్లో చిక్కుకుందనుకుంటున్న సమయంలో ఏపీ, తమిళనాడు ఈశాన్య రుతుపవనాలు కరువు తీరా వర్షాలు కురిపించాయి.  వర్సం ధాటికి చైన్నై మునిగిపోయింది. కుండపోతతో ఇటు తిరుమలలో ప్రాజెక్టులన్నీ మునిగి గేట్లు తెరువాల్సిన పరిస్థితి ఏర్పడింది..ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. రహదారులన్నీ కొట్టుకుపోయాయి.

ఏపీలో 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా..రైళ్లు  విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బుదవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తమిళనాడు, ఏపీల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

తమిళనాట గడిచిన పదేళ్లలో పడని వర్షం కురిసింది. అక్కడ పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. చైన్నైలో బస్సులు మనిగిపోయేంత వరద వచ్చింది. దీంతో వాహనాలు, లోతట్టు ప్రాంతాలు మునిగి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *