
హైదరాబాద్ జిల్లాకు చేరుకోనున్న ఆధునిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచేందుకు గాను చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లోని ఇండోర్ స్టేడియాన్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ నేడు ఉదం తనఖీ చేశారు. అడిషనల్ కిషనర్లు ముషారఫ్ అలీ, అద్వైత్‌కుమార్ సింగ్, జయరాజ్ కెనడిలతో పాటు పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిసి కమిషనర్ వక్టరీ ప్లే గ్రౌండ్‌ను పరిశీలించారు. ఈ సారీ ఎన్నికల నిర్వహణకు ఆధునిక మోడల్ జనరేషన్-5 (ఎం-5) ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం అందచేస్తుందని తెలిపారు. ఈ ఈవీఎంలలో ఓటర్ వెరిఫీయబుల్ ఆడిట్ ప్యాడ్‌లు ఉంటాయని తెలిపారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు 24 గంటల సెక్యురిటీ అవసరని, ఏవిధమైన అగ్ని ప్రమాదాలు గానీ, ఇతర సమస్యలు లేకుండా పకడ్బందీ చర్యలను చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను దానకిషోర్ ఆదేశించారు.