
ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి చివరకు దోమకాటుకు గురై మరణించాడని చరిత్ర చెబుతున్న సత్యం.. రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త మలేరియా వ్యాధి దోమల ద్వారా ప్రబలుతున్నట్లు తొలిసారిగా మన హైద్రాబాద్ లోనే గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పి వందేళ్లు దాటినా నేటికి ‘మలేరియా కు నూరేళ్లు నిండలేదు.. ఇవాళ ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్బంగా దోమల నివారణ చర్యలు చేపట్టాలి.. అప్పుడే మనకు ఆరోగ్యం.. దోమలకు వినాశకరం..
1897 ఆగస్టు 20న ఆడ ఎనాఫిలిస్ దోమ వల్ల మలేరియా వ్యాధి మానవులకు వస్తుందని సర్ రోనాల్డ్ రాస్ హైదరాబాద్ లో కనుగొన్నారు. ఆ రోజు ఆయన చేసిన గుర్తుకు గాను ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (డబ్ల్యూహెచ్వో) ఈరోజున ప్రపంచ దోమల నివారణ దినోత్సవంగా ప్రకటించింది..