ఈయన సంస్కరణలతో కాంగ్రెస్ కు నాయకుల కరువు

రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన సంస్కరణలు తెస్తున్నారు. అలాంటి ఇలాంటి సంస్కరణలు కాదు.. ఏకంగా జాతీయ కాంగ్రెస్ ఏఐసీసీ పోస్టుల భర్తీకి కార్పొరేట్ తరహాలో పరీక్ష , ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతమే లక్ష్యంగా ఆయన ఈ ఎజెండాను నిర్ణయించారు. ఈ ప్రకారం ఎన్నికయ్యే వారికి ప్రాధాన్యం ఇస్తారట.. ఈ పరీక్షలను ఆయనే స్వయంగా చేస్తారని తెలిసింది.. ఇదంతా పారదర్శకంగా నిర్వహించాలని నిర్ణయించారట..

రాష్ట్రాల పీసీసీ అధ్యక్షుల జాబితాను కూడా తెప్పించుకొని ఈ పరీక్ష పెట్టి ఎంపికచేస్తారట.. ఈ పద్ధతితో నాయకులు భయపడుతున్నారు. ఏఐసీసీ రాష్ట్రాల పీసీసీ లు కలిపి మొత్తం 3వేల దరఖాస్తులు వచ్చాయని.. 150 మందికిపైగా నాయకుల పేర్లతో షార్ట్ లిస్ట్ చేశారట.. కాగా ఈ పద్ధతితో కాంగ్రెస్ వృద్ధ నాయకులెవరూ ఎంపికయ్యే అవకాశం లేదని లోలోపల మథన పడుతున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.