ఈయన కొత్త పత్రికకు ఎడిటర్ గా అల్లం.?

-త్వరలోనే ప్రెస్ అకాడమీ పదవికి అల్లం నారాయణ రాజీనామా

నమస్తే తెలంగాణను ఓ ఎత్తుకు తీసుకెళ్లారు ఆ సంస్థ మాజీ చైర్మన్ సీఎల్ రాజం.. ఉద్యోగులకు భారీగా జీతాలిచ్చి బాగా నడిపించారు.  తెలంగాణ ఏర్పడకముందు టీఆర్ఎస్ గొంతుకై నినదించింది నమస్తే తెలంగాణ .. అప్పుడు తెలంగాణ ఉద్యమపార్టీ టీఆర్ఎస్ కు అన్నీ తానై మద్దతుగా నిలిచింది. టీఆర్ఎస్ సపోర్ట్ గా సీఎల్ రాజాం తీసుకొచ్చిన పత్రిక ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన పొరపచ్చాలతో టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సీఎల్ రాజాంను అందులోనుంచి అవమానకర రీతిలో బయటకు పంపిన సంగతి తెలిసిందే..

ఇక ఆయన నమస్తే తెలంగాణలో వాటా వదులకొని కేసీఆర్ తో కటీఫ్ చేసుకొని బీజేపీలో చేరిపోయారు. ఇక్కడే కథ మలుపుతిరిగింది.. బీజేపీ తెలంగాణలో పుంజుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సొంతంగా పార్టీకి సపోర్ట్ గా పత్రిక పెట్టడానికి ప్లాన్ చేసింది. దీనిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , సీఎల్ రాజంకు సూచన చేశారు. తెలంగాణలో బీజేపీ తరఫున పెట్టే పత్రికను మీరే నిర్వహించాలని కోరారట… దీంతో ఒఫ్పుకున్న రాజం 2019 ఎన్నికల ముందే తెలంగాణలో మరో పత్రిక తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు..

అల్లం నారాయణకు గాలం..?

తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అల్లం నారాయణ అసంతృప్తితో రగిలిపోతున్నారు. అటు కేసీఆర్ ను ఎదురించలేక.. ఇటు జర్నలిస్టుల కోరికలు తీర్చలేక ఆయన మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకే ఇక తాను పదవులు వీడి పోరుబాటకు నిర్ణయించుకున్నారట.. అందులో భాగంగానే ప్రెస్ అకాడమీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారట..

ఇప్పుడే దీన్నే అవకాశంగా తీసుకున్నారు సీఎల్ రాజం.. అంతకుముందు రాజాంతో పనిచేసిన  స్నేహం అల్లం నారాయణకు ఉంది.. రాజాం చైర్మన్ గా ఉన్న నమస్తే తెలంగాణకు అల్లం నారాయణే ఎడిటర్ గా చేశారు.. దీంతో మళ్లీ ప్రారంభించబోయే కొత్త పత్రికకు కూడా అల్లంనే తీసుకోవాలని రాజాం యోచిస్తున్నారట.. అందుకే ఆయనను సంప్రదించి ప్రెస్ అకాడమీకి రాజీనామా చేయించి ఎడిటర్ ను చేయాలని చూస్తున్నారట.. కొత్తపత్రిక కు ఎడిటర్ గా జీతం లక్షన్నరకు పైగా ఇస్తానని ఆఫర్ చేశారట రాజాం…

ఈ దెబ్బకు అటు కొత్త పత్రికకు ఎడిటర్ సమస్య.. టీఆర్ఎస్ కు దెబ్బ తీసినట్టు అవుతుందని బీజేపీ ఎత్తుగడ వేసిందట.. అందుకే ఇప్పుడు రాజాం కొత్త పత్రిక తెరపైకి వచ్చింది.. అల్లం నారాయణ కూడా రాజీనామా చేసి మళ్లీ తన కలానికి పదును పెట్టడానికి యోచిస్తున్నారు. దీంతో త్వరలో అల్లం రాజీనామా.. సీఎల్ రాజం కొత్త పత్రిక.. ఒకేసారి రాబోతున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.