ఈయన్ని కొట్టే మగాడు లేడు..

maxresdefault

ప్రతిపక్షాలన్నీ ఏకమైనా సరే ఇక వచ్చే ఎన్నికల వరకు సీఎం కేసీఆర్ ను కొట్టే మగాడు ఇక లేడంటున్నాయి సమీకరణాలు.. వరంగల్ లోక్ సభ బరిలో కేసీఆర్ టీఆర్ఎస్ ను గెలిపించిన తీరు నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉంది.. ప్రజలు సైతం టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు, పాలనకు పట్టం కట్టారు.

టీఆర్ఎస్ సర్కారును ఎన్నికల్లో గెలిపించి కాంగ్రెస్ , బీజేపీల డిపాజిట్లు గల్లంతు కావడానికి ప్రదాన కారణం.. టీఆర్ఎస్ ప్రకటించిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ సమర్థ నాయకత్వమే.. అంతలా చెలిరేగిపోయారు కేసీఆర్..

కేసీఆర్ లాంటి సమర్థ నాయకుడు, వ్యూహకర్త, రాజకీయ దురందరుడు లాంటి నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ప్రస్తుతానికి లేరు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేసీఆర్ వ్యూహాల ముందు దిగదుడుపే.. అంతలా రాజకీయంగా, పాలనలో కేసీఆర్ ముద్ర వేస్తున్నారు.

గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దేవీ ప్రసాద్ ఓటమితో కేసీఆర్ కు కనువిప్పు కలిగింది.దాంతో యువత కోసం ఉద్యోగప్రకటనలు వేశాడు.దీంతో యువత మొత్తం టీఆర్ఎస్ వైపే నిలబడింది.. ప్రజలు కూడా తమకు అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రేమతో టీఆర్ఎస్ ను గెలిపించారు.

మొత్తానికి కేసీఆర్ పాలన తెలంగాణ అభివృద్ది పథంలో ముందుకెళ్తోంది. ఇప్పట్లో కేసీఆర్ ను కొట్టే మగాడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల్లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *