ఈనాడు మాయలో సర్వం కోల్పోయిన సాక్షి

ఈనాడు ఎత్తుగడ సాక్షి కొంప ముంచింది.. జిల్లా కో ఎడిషన్ ను పీకేసి తెలంగాణలో రెండు, ఆంధ్రాలో 3 ఎడిషన్లను మాత్రమే ఉంచి .. జిల్లా ఎడిషన్లను అన్నింటిని ఒక చోట చేర్చాలని ఈనాడు ప్లాన్ చేసింది.. దీని ద్వారా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని చూసింది.. ఇందుకుగాను ముందుగానే ఎన్ఎంఆర్ లను ఒక నెల జీతం ఎక్కువ ఇచ్చి స్వస్తి పలికింది.. ఇక ఎడిషన్లను ఎత్తివేయడమే తరువాయి అనుకున్నారంతా.. కానీ..

ఈనాడు ఎత్తుగడను ముందే పసి గట్టిన సాక్షి తమకు కటకటగా ఉన్న నిధుల కొరతను, భారీ మ్యాన్ పవర్ ను తగ్గించుకోవాలని ఈనాడుకంటే ముందే అడుగులు వేసింది.. వెంటనే తెలంగాణలో ఉత్తర తెలంగాణ ఎడిషన్లను వరంగల్ కు, దక్షిణ తెలంగాణ ఎడిషన్లను హైదరాబాద్ కు తరలించారు. ఆంధ్రాలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి  లకు ఆంద్రా జిల్లాల ఎడిషన్లను తరలించింది.. భారీగా సబ్ ఎడిటర్లను, డిజైనర్లను సాగనంపింది.. భారీగా ఉద్యోగాలు కోల్పోయిన సబ్ ఎడిటర్లు చాలా మంది ఈ ఫీల్డే వద్దనుకొని వ్యాపారాలు మొదలుపెట్టారు. ఇంకొంత మంది వేరే పనులకు వెళ్లిపోయారు.  అక్కడికి కట్ చేస్తే..

ఈనాడు ఎత్తుగడను ముందే అమలు చేద్దామని ముందడుగు వేసింది సాక్షి.. ఇటీవలే ఓ చానల్ నుంచి వచ్చిన ఓ ‘పెద్దమనిషి’ సాక్షికి ఖర్చులు తగ్గిద్దామని చేసిన ప్రయత్నం సాక్షిని చావు పెద్ద చేసింది.. సాక్షి చేసిన ఈ భారీ పొరపాటులో ఏం కోల్పోయిందా తెలుసా.. ఎంతో విలువైన మ్యాన్ పవర్ ను.. తెలివిగల సబ్ ఎడిటర్లను..

చాలా మంది జర్నలిస్టులు అప్పటివరకు గొడ్డు చాకిరీ చేసిన వారే.. సాక్షిని పెట్టిన వైఎస్  ఆ సమయంలో ఇస్తున్న భారీ వేతనాలు.. గొప్ప ఉద్యోగాలకు ఆశపడి జర్నలిస్టులు చాలా మంది సదాశయంతో సాక్షిలో చేరారు. కానీ వైఎస్ మరణించడం.. ఆయన కుమారుడు జగన్ ఎన్నికల్లో ఓడిపోవడం తో సీన్ మారింది.. జర్నలిస్టులకు కష్టకాలం వచ్చింది.. ఎక్కడినుంచో వచ్చిన సీనియర్లు సాక్షిన భ్రష్టు పట్టించారు. తమ చెత్త ఐడియాలతో విలువైన సాక్షిని.. మ్యాన్ పవర్ ను వదులుకున్నారు. ఇప్పుడు సాక్షిలో చేరడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.. ఎందుకంటే తమకు అందులో ఉద్యోగ భద్రత లేదని.. దీంతో సబ్ ఎడిటర్ల కోసం సాక్షి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. చివరకు ఆంద్రప్రభ, జనంసాక్షి లాంటి చిన్నపత్రికల నుంచి కూడా రిక్రూట్ చేసుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు..

చివరగా..

సాక్షి చేసిన ఈ భారీ మార్పుల వల్ల ఆంధ్రాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విజయవాడ వరకు కూడా సర్క్యూలేషన్ భారీగా పడిపోయిందట.. మార్పులు సంస్థ అభ్యున్నతికి తోడ్పడాలి.. ఉద్యోగుల్లో ఈ సంస్థ మనకు అన్నం పెడుతుందని సంబరపడాలి.. కానీ  ఉద్యోగాలు గెంటేసి.. భారీగా తగ్గించి ఎడిషన్లను ఎత్తివేసిన సాక్షి ఇప్పుడు సర్వం కోల్పోయింది..

కొసమెరుపు 

ఈ పరిణామాలన్నీ గమనించిన ఈనాడు.. తాము అమలు చేయాలనుకున్న ప్రయోగం సాక్షి చేసి దెబ్బైపోవడంతో ఇక ప్రయోగాలకు స్వస్తి పలికింది. ఉద్యోగుల్ని తొలగించడం మానేసింది.. జిల్లా ఎడిషన్లను కొనసాగిస్తోంది.. చివరకు దెబ్బై పోయింది సాక్షినే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.