ఈటెల ప్రజలను మోసం చేస్తున్నారు..

కరీంనగర్ : వాటర్ గ్రిడ్ పనులకు టెండర్ పూర్తయినా.. పూర్తి కాలేదని ప్రజలను మోసం చేస్తున్న తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కటకం మృత్యుంయం డిమాండ్ చేశారు. శనివారం ఆయన కరీంనగర్ లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. టెండర్ నిర్వహించి ఇప్పటికీ కమీషన్లు టీఆర్ఎస్ నేతలు పంచుకున్నారని విమర్శించారు. ఈ విషయం ప్రజలకు తెలియకుండా వాటర్ గ్రిడ్ కు టెండర్ కాలేదని మభ్య పెడుతున్నారని విమర్శించారు. వాటర్ గ్రిడ్ పై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు లోపభూయిష్టంగా ఉందని.. దోచుకోవడానికే వారు తెరలేపారని విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ మార్చాలనుకోవడం మానుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ కేవలం మాటల ప్రభుత్వమేనని.. చేతల ప్రభుత్వం కాదని మండిపడ్డారు. ఒక్క రూపాయి కూడా ప్రజాసంక్షేమంలో పక్కదారి పడితే ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *