
హుజూరాబాద్ లో రోడ్డు పక్కన టేలాలు వేసుకొని బతుకు జీవుడా అంటూ పొట్టపోసుకుంటున్న చిన్న వ్యాపారులు ఓ సారి హుజూరాబాద్ లో మంత్రి ఈటెల రాజేందర్ కు కలిసి తమకు ఉపాధికి మంచి షెల్టర్ లు నిర్మించాలని వేడుకున్నారట.. దీంతో సత్వరమే స్పందించిన మంత్రి హుజూరాబాద్ చైర్మన్ తో మున్సిపల్ ఆఫీసు ఎదుట రెండతస్తుల్లో షెల్టర్లు నిర్మించాలని తాను, కౌన్సిలర్లు, ప్రభుత్వం తరఫున సాయం చేస్తానని ప్రకటించి నిధులు మంజూరుచేశారు..
దీంతో నాయకులు యుద్ధ ప్రాతిపదికన బిల్డింగ్ లు నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్దం చేశారు. ప్రస్తుతం నిర్మాణం పూర్తయ్యింది. ఈటెల ప్రారంభించి పేద టేలావాలాలకు ఈ గదులు కేటాయిస్తారు.. బిల్డింగ్ నిర్మాణానికి తోడ్పడ్డ ఈటెల పేరునే పెట్టారు హుజూరాబాద్ మున్సిపాలిటీ కార్యవర్గం..