
ఎప్పుడూ సైలెంట్ గా ఉండే ఈటెల నిన్న ప్రెస్ మీట్ లో కొంచెం ఫైర్ అయ్యాడు. అసత్యాలు రాస్తున్న పత్రికల మీద.. తెలంగాణకు నిధుల కోత విధిస్తున్న మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు..
తెలంగాణకు విభజన చట్టం కింద రావాల్సిన నిధులను కేంద్రం ఇవ్వట్లేదని.. బీహార్ లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ వరాలు కురిపస్తూ వేల కోట్లు నిధులు ఇస్తోందని.. కానీ తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఇలానే కేంద్ర వైఖరి ఉంటే ముందు ముందు రోజుల్లో చీల్చి చెండాడుతామని ఈటెల హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.
కాగా వచ్చే నెల నుంచి తెలంగాణలో రేషన్ కార్డుల జారీ చేస్తామని తెలిపారు. అలాగే ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ఇది వరంగల్, కరీంనగర్ నుంచి ప్రారంభించి తెలంగాణలో గ్యాస్ లేని వారు ఉండకుండా చేస్తామని ఈటెల ప్రతిన బూనారు. అలాగే ధాన్యం కొనుగోళ్లను మహిళా సంఘాల ద్వారా చేస్తామన్నారు.