ఈటల పప్పు.. చాలా చీపు..

తెలంగాణ ప్రభుత్వం మండిపోతున్న ధరలు, ముఖ్యంగా ఆకాశాన్నంటిన కందిపప్పు ధరలను నియంత్రించేందుకు నడుం బిగించింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టింది..

ఆ శాఖ  మంత్రి ఈటల రాజేందర్ శనివారం హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రైతు బజార్ లో కందిపప్పు సబ్సిడీ పంపిణీకి చేపట్టారు. కిలోకు కుటుంబానికి 135 రూపాయలకే ఆయన సరఫరాను చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ధరల నియంత్రణకు వేగంగా స్పందిస్తోందని.. మొన్న ఉల్లిగడ్డల దుకాణాలు, నేడు కందిపప్పు దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తోందన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *