
తమ దేశానికి గత సంవత్సరం 550 మెట్రిక్ టన్నుల అంతర్జాతీయ ధృవీకరణ విత్తనాలను ఎగుమతి చేసినందుకు ఈజిప్ట్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్నతలు తెలిపింది. తాము తెలంగాణ నుండి దిగుమతి చేసుకున్న జొన్న, గడ్డి జొన్న విత్తనాలు బాగున్నాయని, రానున్న కాలంలో మరింత పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోనున్నామన్నారు. తెలంగాణలోని వ్యవసాయ పద్దతులు, నాణ్యమైన విత్తనోత్పత్తి క్రమాలను అధ్యయనం చేయటానికి వచ్చినట్టు చెప్పారు. ఈజిప్ట్ దేశంలోకి కొన్ని కంపనీలు డిమాండ్ ఉన్న పేరొందిన కంపనీల రకాల పేర్లపై ఎగుమతి చేస్తుండేవని, అంతర్జాతీయ OECD విత్తన ధృవీకరణతో ఈ సమస్యను అధిగమించినట్టు హర్షం వ్యక్తం చేసినారు.
ఈజిప్ట్ ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుండి గమల్ అలజబ్, కేంద్ర విత్తన ధృవీకరణ పరిపాలన అధిపతి ఈజిప్ట్ ఎగుమతి దిగుమతుల భాధ్యులు నేతృత్వంలోని అధికారుల బృందం భారత దేశంలో విత్తన ధృవీకరణ క్రమాన్ని అధ్యయనం చేయటానికి ఐదు రోజుల పర్యటనపై ఉన్న బృందం నిన్న హైదరాబాద్ చేరుకున్నది. ఈరోజు అనగా 22.01.2018 నాడు APC రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ C.పార్థ సారథి, IAS గారితో తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రీయ ధృవీకరణ సంస్థలో భేటీ అయినారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. శ్రీ C.పార్థ సారథి గారు మాట్లాడుతూ తాను 1998 లో నెలన్నర పాటు “పత్తి ఉత్పత్తి సాంకేతికత“ పై శిక్షణ కొరకు ఈజిప్ట్ దేశం సందర్శించినట్టు గుర్తుచేసుకుంటూ, అక్కడి వ్యవసాయమంతా సాగునీటి ఆధారంగా ఉంటుందని, అక్కడి వారు అభ్యుదయ రైతులని పేర్కొన్నారు.
దేశీయ విత్తన ధృవీకరణతో పాటు, దేశంలోనే ప్రప్రథమ ఆన్–లైన్ విత్తన ధృవీకరణ క్రమము, ఆంతర్జాతీయ విత్తన ధృవీకరణ మరియు సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణలపై సంస్థ చేస్తున్న కార్యకలాపాలు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ అంతర్జాతీయ విత్తన ధృవీకరణలో అతి తక్కువ సమయంలో తొమ్మిది రాష్ట్రాలకు లీడింగ్ నోడల్ ధృవీకరణ సంస్థగా ఆవతరించిందన్నారు. హైదరాబాద్ లో 400 లకు పైగా విత్తన కంపనీలున్నాయని, దేశ అవసరాలకు నాణ్యమైన విత్తనం 60% తెలంగాణ నుండి ఉత్పత్తి చేయబడి సరఫరా అవుతున్నదని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రిగారి ఆశయమైన “తెలంగాణ – ప్రపంచ విత్తన బాండాగారం“ దిశగా ప్రయాణిస్తున్నామన్నారు.
ఇందులో డాII మార్వా హస్సన్, ఈజిప్ట్ అంతర్గత నాణ్యతా పరిపాలన భాధ్యులు; మహమ్మద్ అలీ మహమ్మద్ ఇబ్రాహిం, ఈజిప్ట్ లో హై టెక్ సీడ్స్ ప్రొడక్షన్ మేనేజర్; ఇబ్రాహిం మహమ్మద్ ఇబ్రాహిం అబ్దెల్దయెమ్, పేరెంట్ సీడ్ మేనేజర్; మొయినుద్దీన్, మేనేజింగ్ డైరెక్టర్; విత్తన ధృవీకరణ సంస్థ సీనియర్ అధికారులు జి.సుదర్శన్, భాస్కర్ సింగ్ మరియు నర్సింహాదాస్ లు పాల్గొన్నారు. శ్రీ గమల్ అలజబ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆన్ – లైన్ విత్తన ధృవీకరణ క్రమము, ఆంతర్జాతీయ విత్తన ధృవీకరణ మరియు సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణలపై సంస్థ చేస్తున్న కార్యకలాపాలు అభినందనీయమన్నారు. ఈజిప్ట్ దేశం నాణ్యమైన విత్తన ఉత్పత్తిలో వెనుకబడి ఉందని, తమ దేశoలో నైపుణ్యం పెంపొందించుకొనేoదుకు శిక్షణ ఇవ్వాల్సిందిగా కోరారు. తమ దేశం సందర్శించాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ కార్యదర్శిని, తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్ ను ఆహ్వానించారు.
డాII కే.కేశవులు, డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రియ ధృవీకరణ సంస్థ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహాయసహకారాలతో నాణ్యమైన విత్తనోత్పత్తికి కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చుకొని, తగిన సిబ్బందిని నియమించుకొన్నామని, సంస్కరణలు ప్రవేశ పెడుతూ, అంతర్జాతీయ సంస్థలతో అనుబంధంతో సంస్థను బలోపేతం చేస్తున్నట్టు చెప్పారు. ఈజిప్ట్ దేశానికి అవసరమైన నైపుణ్యం పెంపొందించుకొనేoదుకు శిక్షణ ఇచ్చేందుకు మరియు నాణ్యమైన విత్తనాలను సరిపడా మొత్తములో ధృవీకరించి ఎగుమతి చేసేందుకు తెలంగాణ సిద్దంగా ఉందన్నారు. శ్రీ C.పార్థ సారథి, IAS గారు మాట్లాడుతూ తెలంగాణలోని భూములు, వాతావరణ పరిస్తితులు నాణ్యమైన విత్తనోత్పత్తికి నిలువకు అత్యంత అనుకూలమని చెబుతూ, భారత దేశ విత్తన భాండాగారమైన తెలంగాణ రాష్ట్రం ఈజిప్ట్ అవసరాల మేరకు కావలసిన మొక్కజొన్న, జొన్న మరియు కూరగాయల నాణ్యమైన విత్తన ఎగుమతులు చేయటానికి సిద్దంగా ఉందన్నారు.
ఈ సంధర్బంగా, శ్రీ C.పార్థ సారథి, IAS గారు మాట్లాడుతూ భారత దేశ విత్తన భాండాగారమైన తెలంగాణ రాష్ట్రం ఈజిప్ట్ అవసరాల మేరకు కావలసిన మొక్కజొన్న, జొన్న మరియు కూరగాయల నాణ్యమైన విత్తన ఎగుమతులు నుండి చేయటానికి సిద్దంగా ఉందన్నారు. ఆసియా ఖండంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ లో 2019 జూన్ నెలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ విత్తన సదస్సులో పాల్గొనాలని శ్రీ C.పార్థ సారథి గారు ఈజిప్ట్ ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు.