
ఈజిప్టు (పిఎఫ్ ప్రతినిధి): రష్యా నుంచి ఈజిప్టు వెళుతున్న ఈజిప్టుకు చెందిన విమానం సాంకేతిక లోపంతో కుప్పకూలినట్లు ఈజిప్టు ప్రధాని ధ్రువీకరించారు. విమానాంలో దాదాపుగా 225 మంది ప్రయాణికులు ఉన్నట్లు రష్యా వర్గాలు తెలిపాయి. అయితే అందులో ఎక్కువ శాతం రష్యా ప్రయాణికులు, చిన్నపిల్లలు ఉన్నట్లు సమాచారం. టేకాఫ్ తీసుకున్న తరువాత 23 నిమిషాలకే రాడార్ తో సంబంధం కొల్పోయిన 3 నిమిషాలకే విమానం కుప్పకూలింది. సాంకేతిక లోపం గమనించి అత్యవసర ల్యాండింగ్ కోసం కైరో వైపు మరల్చగానే ఈ ప్రమాదం జరిగింది. విమానం కుప్పకూలిన ప్రాంతానికి 45 అంబులెన్సులు పంపించారు. అంతే కాకుండా విమాన ప్రమాద స్థలంలో దాదాపుగా 100 వరకు మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.