ఈగ మలిచినోళ్లకే బాహుబలి-2 కాంట్రాక్టు

రాజమౌళి బాహుబలి-2పై అప్పుడే ఫోకస్ పెట్టాడు. డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా విజువల్ ఎఫెక్ట్ బాధ్యతలను బాహుబలి మొదటి పార్ట్ తీసిన వారికి కాకుండా వేరే వారికి అప్పగించారు.

గతంలో మగధీర, ఈగ మూవీలకు విజువల్ ఎఫెక్ట్ అందించిన కమల్ కన్నన్ కు ఈసారి బాహుబలి2 కాంట్రాక్ట్ అప్పగించారు రాజమౌళి.. దీని వెనుక చాలా కథ నడించింది..

బాహుబలి విడుదల కు ముందు కొన్ని వార్ సీన్లు లీక్ అయ్యాయి.. బాహుబలి- పార్ట్ 1కి శ్రీనివాస్ మోహన్ సారథ్యంలోని మకుట విజువల్ టీందల విజువల్ ఎఫెక్ట్ చాలా బాగా చేసింది. ప్రశంసలు వెలువడ్డాయి. కానీ సినిమా విడుదలకు ముందు అందులో పనిచేసే ఈ సాఫ్ట్ వేరర్ వీటిని దొంగతనంగా దొంగిలించి యూట్యూబ్ లో పెట్టారు.  దీంతో బాహుబలి టీం మొత్తం రాజమౌళి కంగారుపడి పోలీసు కేసు పెట్టారు. అంతేకాకుండా చాలా లేట్ గా వారు ఎప్టెక్ట్ సమకూర్చారు.దీని వల్ల అందరి సమయం వృథా అయ్యింది.. చివరకు బాహుబలి విడుదల కావడం హిట్ కావడం జరిగిపోయింది..

ఈసారి బాహుబలి2ని తొందరగా రిలీజ్ చేయాలని, పకడ్బందీగా చేయాలనే తలంపుతోనే బాహుబలి2 బాధ్యతలను రాజమౌళి తనకు ఈగ సినిమా తీసిన కమల్ కన్నన్ కే అప్పగించారు. ఆయన సారథ్యంలోనే బాహుబలి2 విజువల్ ఎఫెక్ట్ పనులు కొనసాగనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *