Breaking News

ఇస్రో శాస్త్ర్రజ్ఞులను అభినందించిన సిఎం

ఇస్రో శాస్త్ర్రజ్ఞులను అభినందించిన సిఎం

పి.ఎస్.ఎల్.వి. సి 37 రాకెట్ ప్రయోగం విజయవంతంగా జరగటం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. ఒకేసారి 104 ఉపగ్రహలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ (ఇస్ర్రో) భారతదేశ ఖ్యాతిని, ప్రతిభను ప్రపంచానికి చాటిందని సిఎం అభిప్రాయడారు. ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారతదేశం రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు. ఇస్ర్రో ఇలాంటి మరిన్ని ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించి, మానవాళి అభివృద్ధిలో శాస్త్ర్ర సాంకేతిక రంగాలను ఉపయోగించాలని సిఎం ఆకాంక్షించారు. మేధాశక్తిని ఉపయోగించి, ఎంతో శ్రమించి ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్ర్రజ్ఞులను అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *