Breaking News

ఇసుక రీచ్ ల ప్రణాళిక తయారు

ఇసుక రీచ్ ల ప్రణాళిక తయారు

కరీంనగర్: జిల్లాలోని గ్రామాల ప్రజల స్ధానిక అవసరాలకు తగిన ఇసుక రీచ్ ల కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యావరణ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మండలానికి ఒకటి ఇసుక పాయింట్లను గుర్తించుటకు సర్వే చేశాయని తెలిపారు. సర్వే ప్రకారము 5 హెక్టార్ల లోపు విస్తీర్ణం లో ఇసుక రీచ్ లకు అనుమతి మంజూరు చేయుటకు జిల్లా పర్యావరణ కమిటి ఆమోదం పొందాల్సి ఉందని తెలిపారు. సర్వే రిపోర్టు
ప్రకారం ఇసుక రీచ్ ల సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) తయారు చేసి వారం రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. ఇసుక రీచ్ లను సాగు, త్రాగునీటి వనరులకు దూరంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఇసుక రీచ్ ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, డిఎఫ్ఓ వినోద్ కుమార్, ఎజెసి డా. ఎ. నాగేంద్ర, మైనింగ్ ఎడి కోదండరాం రెడ్డి, నాబార్డ్ ఎజిఎం రవిబాబు, ఇరిగేషన్ ఎస్సి వెంకటకృష్ణ, భూగర్భజల శాఖ డిడి హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *