ఇసుక అక్రమ రవాణ నివారణకు చర్యలు చేపట్టండి

ఇసుక అక్రమ రవాణ నివారణకు చర్యలు చేపట్టండి

కరీంనగర్: జిల్లాలో ఇసుక అక్రమ రవాణ నిరోధకానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర్ర ఐ.టి., మున్సిపల్, గనుల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రువారం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కన్ఫరెన్సు ద్వారా ఇసుక పాలసీ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి జిల్లాలోను జిల్లా స్ధాయి టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్ పోర్ట్, మైన్స్ అధికారులు కమిటిలో సభ్యులుగా ఉండాలని తెలిపారు. మోబైల్ టీంలకు నిధులను ఎం.డి. మైన్స్ ఇస్తుందని తెలిపారు. ఇసుకను లారీల ద్వారా అక్రమ రవాణ చేసినట్లయితే అట్టి లారీలను సీజ్ చేయాలని ఆదేశించారు. స్ధానిక అవసరాలకు ఇసుక ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా రవాణకు పర్మిట్లను ఇవ్వాలని తెలిపారు. పర్మిట్ లేకుండా రవాణ చేసినట్లయితే అట్టి ట్రాక్టర్ల డ్త్ర్రెవర్లకు ఫైన్ వేయాలని అన్నారు. ఎట్టి పరిస్ధితులలో ట్రాక్టర్లను సీజ్ చేయవద్దని అన్నారు. ఇసుక డంపులను ఏర్పాటు చేసిన వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని అన్నారు. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలిపారు. డంపుతో సంబంధం ఉన్న ట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని అన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ పనులకు అవసరమైన ఇసుకను సరఫరాకు ప్రణాళికను రూపొందించాలని అన్నారు. ఎంత అవసరమవుతుందో గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం త్వరలో దీనిపై ఒక నిర్ణయం ప్రకటిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ పనులను అవసరమైన ఇసుకను అంచనావేసి నివేదికను త్వరలో సమర్పిస్తామని అన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణ నిరోధానికి 5 మోబైల్ టీం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ధానిక అవసరాలకు ఇసుక ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వ ఆమోదానికి పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎడి మైన్స్, రెవెన్యూ అధికారులు, ట్రాన్స్ పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *