ఇసుకేస్తే రాలనంత..

Chandrababu-Naidu

ఏపీలో ఇక నుంచి ఇసుక ఫ్రీగా లభించనుంది. ఇన్నాళ్లు ఇసుక పాలసీ పేరుతో ప్రభుత్వం వేలం వేసి సరఫరా చేస్తుండడం.. కఠిన ఆంక్షలు పెట్టడంతో చాలా వరకు ప్రభుత్వ నిర్మాణాలు, ప్రాజెక్టులకు, సామాన్య జనానికి ఇసుక కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.. చాలా వరకు పేదల ఇంటి నిర్మాణాలు ఇసుక కొరత కారణంగా నిలిచిపోయాయి. దీంతో సీఎం చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం స్పందించింది. నిన్నటి కేబినెట్ మీటింగ్ లో ఇసుకను ఏపీలో ఫ్రీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.. ఉచితంగా అందివ్వడం ద్వారా ప్రజలకు, ప్రాజెక్టులకు, ఇతర నిర్మాణాలు త్వరగా పూర్తయ్యి అభివృద్ధి సాధిస్తారని ప్రభుత్వం నమ్ముతోంది. అదే సమయంలో ఇసుకను ఎవరు పడితే వారు తవ్వి దోచుకునే విధానాలకు స్వస్తి పలకాలన్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఇసుకను ఉచితంగా అందివ్వాలని చంద్రబాబు సూచించారు.  ఇసుక విధానాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ పోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇసుక విక్రయాల ద్వారా 600 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా వదులుకొని ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *