
ఢిల్లీ, ప్రతినిధి : డివిలియర్స్ పరుగులు సునామీలో దక్షిణాఫ్రికాలోని జోహెనెస్ బర్గ్ స్టేడియం తడిసిముద్దైంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ మెరుపు శతకం దాటికి దక్షిణాఫ్రికా వెస్టిండీస్ పై 439 పరుగులు చేసి వన్డేల్లో రెండో అత్యధిక స్కోరు నమోదు చేసింది.. డివిలయర్స్ ఊచకోత ఎలా సాగిందంటే.. కేవలం 16 బంతుల్లో అర్థశతకం.. రికార్డు స్థాయిలో 31 బంతుల్లో శతకంతో ప్రపంచ రికార్డులను తిరగరాశారు.
వెస్టీండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ రికార్డుల మోత మోగింది. డివిలయర్స్ (149) పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 439 పరుగుల భారీ స్కోరు చేసింది. డివిలియర్స్ తో పాటు హషీమ్ ఆమ్లా.. (153) నాటౌట్, రోసౌ(128) అద్భుత శతకాలు చేయడంతో ఈ భారీ స్కోరు సాధ్యమైంది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం సాధించేలా కనపడలేదు. చివరకు 7 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. 148 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓడిపోయింది.