హత్యకు గురై చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి తనను హత్య చేసిన రౌడీల మీద ప్రతీకారం తీసే కథతో రూపొందుతుంది ‘మిస్టర్ ఎక్స్’. బాలీవుడ్ సీరియస్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి హీరోగా నటిస్తున్నారు. మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో రఘురాం రాథోడ్ గా ఇమ్రాన్ నటిస్తున్నాడు. ఎదుటి వ్యక్తికి కనపడకుండా వారితో ఫైటింగ్ లు , లవర్ తో రోమాన్స్ చేసే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సైంటిఫిక్ మూవీ వచ్చే ఏప్రిల్ 17న త్రీడీలో విడుదల కాబోతోంది. ఇందులో అమీరా దస్తూర్ హీరోయిన్ గా నటిస్తోంది.