Breaking News

ఇప్పట్లో కేసీఆర్ కు తిరుగులేదు..

kcr2

 తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ రెండున్నర పాలన గడిచింది.. సీఎం కేసీఆర్ ప్రజాకర్షక పథకాలతో దూసుకుపోతున్నారు. జిల్లాల విభజన పూర్తయ్యింది. మరి టీఆర్ఎస్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. ఓకే పాస్ మార్కులు వేస్తారా.. మరో సారి అధికారం కట్టబెడతారా.. ఇవే డౌట్లు సీఎం కేసీఆర్ కు వచ్చాయి. అంతే ఇంటెలిజన్స్ తో పాటు వివిధ ప్రతిష్టాత్మక నమ్మకమైన సర్వే సంస్థలతో తెలంగాణలో సర్వే నిర్వహించారట..

ఇటీవల కేసీఆర్ ఫాంహౌస్ లో సీనియర్ నేతలకు విందు ఇచ్చారు. ఇందులో ఆయన వారితో ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే విజయం.. ప్రతిపక్షాలకు ఆరేడు సీట్లు కూడా రావు’ అని ఆనందం వ్యక్తం చేశారట.. దీనకంతటికి కేసీఆర్ నిర్వహించిన సర్వే ఫలితాలే కారణమట.. సర్వేల్లో తెలంగాణ జనం సీఎం పనితీరుకు ఫిదా అవుతున్నారట.. సీఎం సూపర్ అంటూ ప్రభుత్వ పనితీరు కు సంతృప్తి వ్యక్తం చేశారట.. ఇక కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి ప్రభుత్వానికి మచ్చ తెస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు అందుబాటులో స్థానికంగా ఉండక ప్రజల దృష్టిలో విలన్లయ్యారు. వారి బ్యాడ్ రికార్డు తెలసుకొని కేసీఆర్ నేతలకు క్లాసులు తీసుకున్నారని సమాచారం. తప్పులు సరిదిద్దుకోవాలని హితవు పలికారు.. మొత్తానికి కేసీఆర్ నిర్వహించిన తాజా సర్వేతో జనాభిప్రాయంలో కేసీఆర్ టాప్ లో.. మంత్రులు ఫ్లాప్ లో ఉన్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *